Renigunta: రేణిగుంటలో తిరుపతి కో-ఆపరేటివ్ బ్యాంకు 6వ శాఖ ప్రారంభం
Renigunta: రేణిగుంటలో తిరుపతి కో-ఆపరేటివ్ బ్యాంకు 6వ శాఖను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు.
Renigunta: రేణిగుంటలో తిరుపతి కో-ఆపరేటివ్ బ్యాంకు 6వ శాఖ ప్రారంభం
రేణిగుంట: రేణిగుంటలో నూతనంగా ఏర్పాటు చేసిన తిరుపతి కో-ఆపరేటివ్ బ్యాంకు 6వ శాఖను బుధవారం ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, మేయర్ శిరీష తదితరులు హాజరయ్యారు.
బ్యాంకు చైర్మన్ జయచంద్రారెడ్డి అతిథులకు సాదర స్వాగతం పలికారు. శాఖ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి బ్యాంకు సేవలను పరిశీలించి, స్వయంగా ఖాతాదారుడిగా చేరారు.
ఈ సందర్భంగా మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ రేణిగుంట ప్రజలు, వ్యాపారులకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. గతంలో తాను చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని శాఖ ఏర్పాటు చేసినందుకు చైర్మన్ జయచంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో బ్యాంకు ఎండీ శివకుమార్‌రెడ్డి, మేనేజర్ వినోద్, బ్రహ్మానందరెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ సిద్ధగుంట సుధాకర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు గంగారి రమేష్, ఎంపీపీ హరిప్రసాద్‌రెడ్డి, జడ్పీటీసీ సంధ్యతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




