Renigunta: రేణిగుంట జడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా జీ. పాల్యం తేజోవతి ఖరారు!
Renigunta: రేణిగుంట మండల జడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా జీ. పాల్యం తేజోవతి ఖరారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ చేతుల మీదుగా బీ-ఫారం అందజేత.
Renigunta: రేణిగుంట జడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా జీ. పాల్యం తేజోవతి ఖరారు!
Renigunta: రేణిగుంట మండల జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా జీ. పాల్యం తేజోవతి ఖరారయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ చేతుల మీదుగా ఆమె బీ-ఫారం అందుకున్నారు.
కూటమి తరఫున తనకు జడ్పీటీసీ అభ్యర్థిగా అవకాశం కల్పించడంపై తేజోవతి సంతోషం వ్యక్తం చేశారు. తనపై నమ్మకంతో బాధ్యత అప్పగించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. రేణిగుంట మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని, ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి నిరంతరం పనిచేస్తానని ఆమె పేర్కొన్నారు. ప్రజల ఆదరాభిమానాలతో ఎన్నికల్లో విజయం సాధించి మండల అభివృద్ధికి కృషి చేస్తానని తేజోవతి తెలిపారు.




