Renigunta: ఉత్తమ ఉపాధ్యాయుడిగా కె. చంద్రశేఖర్‌కు డీఈవో అవార్డు
Renigunta: అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రేణిగుంట మండలం వెదుళ్లచెరువు పాఠశాల ఉపాధ్యాయుడు కె. చంద్రశేఖర్ డీఈవో చేతుల మీదుగా ఉత్తమ అవార్డు అందుకున్నారు.
Renigunta: ఉత్తమ ఉపాధ్యాయుడిగా కె. చంద్రశేఖర్‌కు డీఈవో అవార్డు
తిరుపతి జిల్లా, రేణిగుంట: అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తిరుపతి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక జరిగింది.
రేణిగుంట మండలం వెదుళ్లచెరువు ఎస్.టి. కాలనీ మోడల్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు కె. చంద్రశేఖర్ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికై జిల్లా విద్యాశాఖ అధికారి కె.వి.ఎన్. కుమార్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.
ఈ సందర్భంగా ఆషా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు, పాఠశాల కో-ఆప్షన్ సభ్యులు డి. జూలియన్ రాజు చంద్రశేఖర్ ను శాలువా,పూలమాలతో సత్కరించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు చంద్రవర్ణిని, ఉపాధ్యాయులు, అంగన్వాడీ సిబ్బంది, ఆషా సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.




