Renigunta: రేణిగుంటలో వైసీపీలోకి టీడీపీ సీనియర్ నాయకుడు
Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఆర్. మల్లవరం టీడీపీ సీనియర్ నాయకుడు చంద్ర యాదవ్ మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు.
Renigunta: రేణిగుంటలో వైసీపీలోకి టీడీపీ సీనియర్ నాయకుడు
రేణిగుంట: మేజర్ న్యూస్ రేణిగుంట మండలం ఆర్. మల్లవరం పంచాయతీకి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు చంద్ర యాదవ్ తన అనుచరులతో కలిసి శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
రేణిగుంట పట్టణంలోని వైసీపీ మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకుని పార్టీలో చేరికను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు సిద్ధగుంట సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ అత్తూరు హరి పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




