Renigunta: రేణిగుంటలో ప్రశాంతంగా పరిషత్ పోలింగ్!

Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 28.66 శాతం పోలింగ్ నమోదైంది.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 5 Nov 2026 12:14 PM IST
Renigunta
X

Renigunta: రేణిగుంటలో ప్రశాంతంగా పరిషత్ పోలింగ్!

Renigunta: రేణిగుంట మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మండలంలోని 70 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 62,579 మంది ఓటర్లకు గాను ఉదయం 11 గంటల వరకు 17,935 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో 28.66 శాతం పోలింగ్ నమోదైంది.

ఓటు వేసిన వారిలో 8,843 మంది పురుషులు, 9,032 మంది మహిళలు ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరగా, మధ్యాహ్నానికి పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA