Renigunta: రేణిగుంట యార్డు అభివృద్ధి పనుల కారణంగా రెండు రైళ్లు రద్దు!
Renigunta: రేణిగుంట రైల్వే యార్డులో పునర్నిర్మాణ పనుల దృష్ట్యా తిరుపతి - పుదుచ్చేరి మధ్య నడిచే రెండు రైళ్లను డిసెంబర్ 9 నుండి 19 రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Renigunta: రేణిగుంట యార్డు అభివృద్ధి పనుల కారణంగా రెండు రైళ్లు రద్దు!
Renigunta: గుంతకల్లు డివిజన్ పరిధిలోని రేణిగుంట రైల్వే యార్డులో పునర్నిర్మాణ మరియు ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ పనులు సుమారు 48 రోజుల పాటు జరగనున్నాయి. ఈ పనుల దృష్ట్యా రైల్వే శాఖ 19 రోజుల పాటు రెండు రైళ్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి:
పుదుచ్చేరి – తిరుపతి (16112): ఈ రైలును డిసెంబర్ 9వ తేదీ నుండి 27వ తేదీ వరకు రద్దు చేశారు.
తిరుపతి – పుదుచ్చేరి (16111): ఈ రైలును డిసెంబర్ 10వ తేదీ నుండి 28వ తేదీ వరకు రద్దు చేశారు.
ప్రయాణికులు ఈ రైళ్ల రద్దు విషయాన్ని గమనించి, తమ ప్రయాణాలకు వేరే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని రైల్వే అధికారులు కోరారు.




