Renigunta: రేణిగుంట రైల్వే స్టేషన్ వద్ద అస్తవ్యస్త పార్కింగ్, ట్రాఫిక్ జామ్
Renigunta: రేణిగుంట రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం వద్ద నో పార్కింగ్ ఏరియాలో వాహనాల నిలుపుదలతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు.
Renigunta: రేణిగుంట రైల్వే స్టేషన్ వద్ద అస్తవ్యస్త పార్కింగ్, ట్రాఫిక్ జామ్
రేణిగుంట: రేణిగుంట రైల్వే స్టేషన్ ప్రధాన ముఖద్వారం వద్ద నో పార్కింగ్ ఏరియాలో ద్విచక్ర వాహనాలను ఇష్టారాజ్యంగా పార్కింగ్ చేస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు బస్సులు, ప్రైవేట్ ఫోర్ వీలర్స్ ఎదురెదురుగా వచ్చిన సమయంలో రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి పూర్తిస్థాయిలో ట్రాఫిక్ జామ్ అవుతోంది.
దీంతో రైల్వే స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు, రైళ్ల కోసం వెళ్లే వారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అత్యవసర సమయాల్లో కూడా వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంటోంది. నో పార్కింగ్ బోర్డులు ఉన్నప్పటికీ వాహనాల నిలుపుదల కొనసాగుతుండటంపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత రైల్వే అధికారులు ఈ సమస్యను సీరియస్‌గా తీసుకొని నో పార్కింగ్ ప్రాంతంలో వాహనాల నిలుపుదలను అరికట్టడంతో పాటు, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. స్టేషన్ ప్రధాన ద్వారం వద్ద ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.




