Renigunta: రేణిగుంట రైల్వే స్టేషన్‌లో ఘనంగా అన్నదానం!

Renigunta: శ్రీవారి బ్రహ్మోత్సవాలు, నవరాత్రుల వేళ రేణిగుంట రైల్వే స్టేషన్‌లో బిఎంఎస్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. పారిశుధ్య, వలస కార్మికులకు భోజన వితరణ.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 13 Oct 2026 2:30 PM IST
Renigunta
X

Renigunta: రేణిగుంట రైల్వే స్టేషన్‌లో ఘనంగా అన్నదానం!

Renigunta: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా రేణిగుంట రైల్వే స్టేషన్‌లో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బీఎంఎస్ (BMS) జిల్లా కార్యదర్శి వెంకటాద్రి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రైల్వే ప్రాంగణంలో పనిచేసే పారిశుధ్య కార్మికులు, వలస కార్మికులు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రైల్వే ప్రయాణికులకు భోజనం, తాగునీరు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి జాతీయ కార్మిక సలహా కమిటీ సభ్యులు సీనప్ప, రాష్ట్ర వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ తేజోవతి అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. భక్తులు, ప్రయాణికుల సౌకర్యం కోసం నిరంతరం శ్రమించే పారిశుధ్య కార్మికులకు, వలస కార్మికులకు పర్వదినాల సందర్భంగా అన్నదానం చేయడం సంతోషంగా ఉందన్నారు. రైల్వే ప్రయాణికులు, కార్మికుల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రైల్వే యూనియన్ నాయకులు ఓంనాథ రెడ్డి, పలువురు రైల్వే ఉద్యోగులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA