Renigunta: రేణిగుంట ఫ్లైఓవర్‌పై గుంతలు వాహనదారులకు తప్పని ఇబ్బందులు!

Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట ఫ్లైఓవర్‌పై గుంతలమయంగా మారిన రహదారి. వర్షాలకు దెబ్బతిన్న రోడ్డుతో వాహనదారులకు తప్పని ఇబ్బందులు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 10 Nov 2026 8:36 AM IST
Renigunta
X

Renigunta: రేణిగుంట ఫ్లైఓవర్‌పై గుంతలు.. వాహనదారులకు తప్పని ఇబ్బందులు!

రేణిగుంట: రేణిగుంట ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద రహదారి గుంతలమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డుపై పలుచోట్ల గుంతలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా బ్రిడ్జిపై ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు ఈ గుంతల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు.

రహదారిపై ఏర్పడిన గుంతలను తప్పించుకునే క్రమంలో వాహనాలు అదుపుతప్పే ప్రమాదం ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో ఈ గుంతలు మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.

సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఫ్లైఓవర్‌పై ఏర్పడిన గుంతలను పరిశీలించి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. ప్రమాదాలు చోటుచేసుకోకముందే రహదారిని బాగు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA