Renigunta: రేణిగుంటలో నవంబర్ 2న ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్ పోలింగ్!
Renigunta: రేణిగుంట మండలంలో నవంబర్ 2న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ పోలింగ్. ఎంపీడీవో కార్యాలయంలో ఉదయం 10 నుండి సాయంత్రం 5 వరకు నిర్వహణ.
Renigunta: రేణిగుంటలో నవంబర్ 2న ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్ పోలింగ్!
Renigunta: ఎంపీటీసీ, జెడ్పీటీసీ రెండో సాధారణ ఎన్నికలు–2026లో భాగంగా రేణిగుంట మండలంలో నవంబర్ 2న పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎంపీడీవో కె.వి. రవిచంద్ర, ఎన్నికల అధికారి ఆదినారాయణ తెలిపారు. ఈ మేరకు శనివారం రేణిగుంట ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఏర్పాట్ల వివరాలను వెల్లడించారు.
స్థానిక ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో నవంబర్ 2న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఈ అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు.
పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ నిర్వహణకు ఆరుగురు సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. ఎల్. కృష్ణను ఓవరాల్ ఇన్చార్జిగా నియమించి, మిగిలిన సిబ్బందికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ సెగ్మెంట్ల వారీగా బాధ్యతలు అప్పగించారు. విధులకు కేటాయించిన సిబ్బంది నవంబర్ 2న ఉదయం 8.30 గంటలకు కార్యాలయంలో హాజరుకావాలని ఆదేశించారు.
పోలింగ్ ప్రక్రియలో బ్యాలెట్ రిజిస్టర్ల నిర్వహణ, ఓటర్ల సంతకాల సేకరణ, పోలింగ్ అనంతరం బ్యాలెట్లు, రిజిస్టర్లను అధికారులకు అప్పగించడం వంటి బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ఎన్నికల విధుల్లో ఉన్న అర్హులైన సిబ్బంది ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎంపీడీవో రవిచంద్ర కోరారు.




