Tirupati: రేణిగుంటలో తప్పిపోయిన ఇద్దరు బాలురు సురక్షితం..మహబూబ్నగర్లో ఆచూకీ!
Tirupati: తిరుపతి జిల్లా రేణిగుంటలో అదృశ్యమైన ఇద్దరు బాలురు ఒక్క రోజులోనే లభ్యం. తెలంగాణలోని మహబూబ్నగర్లో గుర్తించి క్షేమంగా తీసుకొస్తున్న పోలీసులు.
Tirupati: రేణిగుంటలో తప్పిపోయిన ఇద్దరు బాలురు సురక్షితం..మహబూబ్నగర్లో ఆచూకీ!
Tirupati: రేణిగుంట పట్టణంలో తీవ్ర కలకలం రేపిన బాలుర అదృశ్యం ఉదంతం సుఖాంతమైంది. పోలీసుల అప్రమత్తత, క్షేత్రస్థాయిలో వేగవంతమైన విచారణ కారణంగా ఒక్క రోజులోనే ఇద్దరు పిల్లల ఆచూకీ లభించింది.
రేణిగుంట బుగ్గ వీధికి చెందిన జి. పాండురంగ (12) మరియు పి. గణేష్ రెడ్డి (15) అనే ఇద్దరు బాలురు అక్టోబర్ 02, 2026 న అదృశ్యమయ్యారు.
పిల్లలు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే రేణిగుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన రేణిగుంట పోలీసులు వెంటనే క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి, సాంకేతికత మరియు ప్రత్యేక బృందాల సహకారంతో గాలింపు చర్యలుముమ్మరం చేశారు.
మహబూబ్నగర్లో లభించిన ఆచూకీ పోలీసుల దర్యాప్తులో తేలిన సమాచారం ప్రకారం, నిన్న తప్పిపోయిన ఈ ఇద్దరు బాలురి ఆచూకీ రాత్రి 11:00 గంటలకు తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ రైల్వే స్టేషన్లో లభించింది. సమాచారం అందిన వెంటనే రేణిగుంట పోలీస్ సిబ్బంది రాత్రికి రాత్రే అక్కడికి బయలుదేరి వెళ్లి, ప్రస్తుతం ఆ బాలురిని సురక్షితంగా తీసుకుని వస్తున్నారు.
కేవలం ఒక్క రోజు వ్యవధిలో అప్రమత్తంగా వ్యవహరించి, రాత్రికి రాత్రే వేరే రాష్ట్రానికి వెళ్లి పిల్లలను క్షేమంగా తీసుకువస్తున్న రేణిగుంట పోలీసుల చొరవను స్థానికులు, బాలుర తల్లిదండ్రులు ఎంతగానో కొనియాడుతున్నారు. "శభాష్ రేణిగుంట పోలీస్" అంటూ సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.




