Renigunta: రేణిగుంటలో వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీసులు
Renigunta: డయల్ 112 అత్యవసర కాల్‌కు సకాలంలో స్పందించి రేణిగుంట రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యకు యత్నించిన లోకేష్ అనే వ్యక్తి ప్రాణాలను పోలీసులు కాపాడారు.
Renigunta: రేణిగుంటలో వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీసులు
రేణిగుంట: అత్యవసర సేవల నంబర్ 112కు వచ్చిన కాల్‌కు సకాలంలో స్పందించి ఓ వ్యక్తి ప్రాణాలను రేణిగుంట పోలీసులు కాపాడారు. తిరుపతికి చెందిన లోకేష్ తాను చనిపోతానని కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా చెప్పడంతో ఆందోళనకు గురైన వారు వెంటనే 112కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు 112 ద్వారా అందిన లొకేషన్ ఆధారంగా లోకేష్ రేణిగుంట సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఉన్నట్లు గుర్తించారు. వెంటనే స్పందించిన రేణిగుంట పోలీస్ స్టేషన్ రైటర్ సి.వి. చలపతి, కానిస్టేబుల్ త్రినాథ్ అక్కడికి చేరుకుని అతడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి తక్షణమే స్పందించడంతో ఓ ప్రాణాన్ని కాపాడగలిగారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు వెంటనే 112కు కాల్ చేసి పోలీసుల సహాయం పొందాలని రేణిగుంట పోలీసులు సూచించారు.




