Renigunta: రేణిగుంట మండల రాజకీయాలు, స్థానిక సమస్యలపై కూటమి నేతల సమగ్ర చర్చ!
Renigunta: రేణిగుంట మండలానికి చెందిన కూటమి ఎంపీటీసీ అభ్యర్థులు తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి, స్థానిక రాజకీయ పరిస్థితులపై చర్చించారు.
Renigunta: రేణిగుంట మండల రాజకీయాలు, స్థానిక సమస్యలపై కూటమి నేతల సమగ్ర చర్చ!
Renigunta: తిరుపతి పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి, తుడా ఛైర్మన్, టీటీడీ ఎక్స్ అఫీషియో సభ్యుడు డా. డాలర్స్ దివాకర్ రెడ్డిని రేణిగుంట మండలానికి చెందిన కూటమి ఎంపీటీసీ అభ్యర్థులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా స్థానిక కార్యాలయంలో ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం కొద్దిసేపు సమావేశమైన అభ్యర్థులు రేణిగుంట మండలంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, గ్రామాల్లో నెలకొన్న స్థానిక సమస్యలు, ఎన్నికల పరిస్థితులపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో రేణిగుంట మండల కూటమి ఎంపీటీసీ అభ్యర్థులతో పాటు పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




