Renigunta: రేణిగుంట మండలంలో ప్రశాంతంగా ప్రారంభమైన ఎంపీటీసీ జెడ్పీటీసీ పోలింగ్!

Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో 17 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 4 స్థానాలు, జెడ్పీటీసీకి పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 5 Nov 2026 8:25 AM IST
Renigunta
X

Renigunta: రేణిగుంట మండలంలో ప్రశాంతంగా ప్రారంభమైన ఎంపీటీసీ జెడ్పీటీసీ పోలింగ్!

Renigunta: రేణిగుంట మండల పరిధిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ గురువారం ఉదయం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైంది. మండలంలో మొత్తం 21 ఎంపీటీసీ స్థానాలకు గాను ఇప్పటికే 17 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన నాలుగు స్థానాలైన రేణిగుంట సెగ్మెంట్-3, సెగ్మెంట్-5, సూరప్పకసం, గుత్తివారిపల్లిలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.

ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. జెడ్పీటీసీ స్థానానికి కూడా పోలింగ్ కొనసాగుతోంది. ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా, పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మండలవ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా కొనసాగుతోంది.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA