Renigunta: రేణిగుంటలో బ్యాలెట్ బాక్సుల భద్రతను పరిశీలించిన ఎంపీడీవో రవిచంద్ర

Renigunta: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రేణిగుంట మండల పరిషత్ స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సులను ఎంపీడీవో రవిచంద్ర శనివారం పరిశీలించారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 17 Oct 2026 5:34 PM IST
Renigunta
X

Renigunta: రేణిగుంటలో బ్యాలెట్ బాక్సుల భద్రతను పరిశీలించిన ఎంపీడీవో రవిచంద్ర

Renigunta: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా రేణిగుంట మండల పరిషత్‌ కార్యాలయంలోని స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరిచిన బ్యాలెట్‌ బాక్సులను ఎంపీడీవో రవిచంద్ర శనివారం పరిశీలించారు. పెద్దవి, చిన్నవి కలిపి 20 బ్యాలెట్‌ బాక్సుల సంఖ్య,వాటి ప్రస్తుత పరిస్థితిని తనిఖీ చేశారు.

బ్యాలెట్‌ బాక్సులు తుప్పు పట్టకుండా తీసుకుంటున్న జాగ్రత్తలు, సీలింగ్‌ పరికరాల పనితీరును పరిశీలించారు. బాక్సులు సరైన గా ఉన్నాయా అని,అనంతరం సంబంధిత రికార్డులు, రిజిస్టర్లలో నమోదైన వివరాలను భౌతికంగా ఉన్న బ్యాలెట్‌ బాక్సుల సంఖ్యతో సరిపోల్చి తనిఖీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్‌డీ, డిప్యూటీ ఎంపీడీవో ప్రభురావు తదితరులు పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA