Renigunta: రేణిగుంట: మీసేవ సేవల పునరుద్ధరణపై ఎమ్మెల్యేలకు వినతి
Renigunta: మీసేవ, ఏపీ సేవ పోర్టళ్లలో నిలిపివేసిన ధ్రువీకరణ పత్రాల రీ-ఇష్యూ సేవలను వెంటనే పునరుద్ధరించాలని కోరుతూ రేణిగుంటలో ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందజేశారు.
Renigunta: రేణిగుంట: మీసేవ సేవల పునరుద్ధరణపై ఎమ్మెల్యేలకు వినతి
రేణిగుంట: మీసేవ, ఏపీ సేవ పోర్టళ్లలో నిలిపివేసిన కీలక సేవలను వెంటనే పునరుద్ధరించాలని మీసేవ నిర్వాహకుల సమైక్య సంక్షేమ సంఘం కోరింది. ఈ మేరకు ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందజేసి, సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేసింది.
కులం, ఆదాయ ధృవీకరణ పత్రాల రీ-ఇష్యూ, పట్టాదార్ పాస్‌బుక్ రీప్రింట్, వాటర్ ట్యాక్స్, జనన–మరణ ధృవీకరణ పత్రాల సేవలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సంఘం తెలిపింది.
ఆన్‌లైన్ సేవలపై అవగాహన లేని వృద్ధులు, నిరక్షరాస్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మరోవైపు సేవలు నిలిపివేయడంతో మీసేవ నిర్వాహకుల ఉపాధిపైనా ప్రభావం పడుతోందని పేర్కొంది.
ప్రజలకు సురక్షితమైన సేవలు అందించడంతో పాటు నిర్వాహకుల ఉపాధిని కాపాడేందుకు మీసేవ, ఏపీ సేవ, ‘మన మిత్ర’ పోర్టళ్లలో అన్ని కీలక సేవలను పునరుద్ధరించాలని సంఘం కోరింది.




