Renigunta: రేణిగుంట డంపింగ్ యార్డులో చెత్తకు నిప్పు.. పొగతో ఇక్కట్లు

Renigunta: రేణిగుంట పంచాయతీ డంపింగ్ యార్డులో వ్యర్థాలను తగలబెట్టడంతో దట్టమైన పొగ వ్యాపించి వాహనదారులు, పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 10 Oct 2026 7:56 PM IST
Renigunta
X

Renigunta: రేణిగుంట డంపింగ్ యార్డులో చెత్తకు నిప్పు.. పొగతో ఇక్కట్లు

రేణిగుంట: పంచాయతీ డంపింగ్ యార్డులో వ్యర్థాలను తగలబెట్టడంతో మంటలు ఎగసిపడుతూ, దట్టమైన పొగ పరిసర ప్రాంతాలను కమ్ముకుంటోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా చెలరేగుతున్న మంటలు, వ్యాపిస్తున్న పొగతో అటుగా ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోతున్నారు.

చెత్తను శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహించాల్సిన బాధ్యత ఉన్న అధికారులు, వ్యర్థాలను తగలబెట్టడంపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. పొగ కారణంగా రహదారిపై ప్రయాణించే వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పరిసరాల్లో నివసించే ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చెత్త నిర్వహణకు ఇదేనా పరిష్కారం?

డంపింగ్ యార్డులో వ్యర్థాలను బహిరంగంగా దహనం చేయకుండా సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మంటలు చెలరేగడానికి గల కారణాలను పరిశీలించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఈ సమస్యపై పంచాయతీ అధికారులు స్పందిస్తారా? లేదా? అన్నది వేచి చూడాలి.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA