Renigunta: రేణిగుంట మండలంలో మధ్యాహ్నం 1 గంట వరకు 41.80 శాతం పోలింగ్ నమోదు!

Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో మధ్యాహ్నం 1 గంట సమయానికి 41.80% పరిషత్ పోలింగ్ నమోదైంది. మహిళా ఓటర్లు అత్యధిక సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 5 Nov 2026 1:42 PM IST
Renigunta
X

Renigunta: రేణిగుంట మండలంలో మధ్యాహ్నం 1 గంట వరకు 41.80 శాతం పోలింగ్ నమోదు!

Renigunta: మండల పరిధిలో జరుగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో మధ్యాహ్నం 1 గంట వరకు 41.80 శాతం పోలింగ్ నమోదైంది. మండలవ్యాప్తంగా మొత్తం 70 పోలింగ్ కేంద్రాల్లో 62,579 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 26,155 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

వీరిలో 12,420 మంది పురుషులు, 13,735 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మధ్యాహ్నం వరకు మహిళా ఓటర్లు పురుషుల కంటే అధిక సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. మిగిలిన సమయంలో కూడా ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA