Renigunta: రేణిగుంట మండలంలో 19 పంచాయతీలకు 17 నామినేషన్లు నమోదు!

Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలోని 19 గ్రామ పంచాయతీలకు సంబంధించి అందిన నివేదిక ప్రకారం సర్పంచ్ స్థానాలకు 11, వార్డు సభ్యుల స్థానాలకు 6 చొప్పున మొత్తం 17 నామినేషన్లు నమోదయ్యాయి.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 15 Nov 2026 1:55 PM IST
Renigunta
X

Renigunta: రేణిగుంట మండలంలో 19 పంచాయతీలకు 17 నామినేషన్లు నమోదు!

రేణిగుంట: రేణిగుంట మండల పరిధిలోని 19 గ్రామ పంచాయతీలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియలో భాగంగా అందిన గంటల వారీ నివేదిక ప్రకారం మొత్తం 17 నామినేషన్లు నమోదయ్యాయి. వీటిలో సర్పంచ్ స్థానాలకు 11 నామినేషన్లు, వార్డు సభ్యుల స్థానాలకు 6 నామినేషన్లు వచ్చాయి.

గ్రామాల వారీగా పరిశీలిస్తే అత్తూరు గ్రామ పంచాయతీలో సర్పంచ్ స్థానానికి ఒకటి, కరకంబాడిలో రెండు, మామండూరులో రెండు, ఆర్.మల్లవరంలో సర్పంచ్ స్థానానికి ఒకటి, వార్డు స్థానాలకు మూడు, రేణిగుంటలో ఒకటి, తూకివాకంలో ఒకటి, వెంకటాపురంలో ఒకటి, తాండ్లంలో సర్పంచ్ స్థానాలకు రెండు, వార్డు స్థానాలకు రెండు నామినేషన్లు నమోదయ్యాయి.

ఎలమండ్యం గ్రామంలో వార్డు స్థానానికి ఒక నామినేషన్ వచ్చింది. మొత్తంగా సర్పంచ్ స్థానాలకు 11, వార్డు-1కు ఒకటి, వార్డు-2కు రెండు, వార్డు-3కు ఒకటి, వార్డు-4కు రెండు నామినేషన్లు నమోదైనట్లు నివేదిక వెల్లడిస్తోంది. వార్డు-5కు ఎలాంటి నామినేషన్ నమోదు కాలేదు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA