Renigunta: ఢిల్లీ లాఠీఛార్జ్‌కు నిరసనగా రేణిగుంటలో వామపక్షాల ధర్నా

Renigunta: ఢిల్లీలో విద్యార్థులపై లాఠీఛార్జ్, ఓట్ల తొలగింపును నిరసిస్తూ రేణిగుంట అంబేడ్కర్ విగ్రహం వద్ద సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 11 Oct 2026 7:02 PM IST
Renigunta
X

Renigunta: ఢిల్లీ లాఠీఛార్జ్‌కు నిరసనగా రేణిగుంటలో వామపక్షాల ధర్నా

Renigunta: ఎస్.ఐ.ఆర్ పేరుతో 13 కోట్ల 35 లక్షల ఓటర్లను ఏకపక్ష నిర్ణయాలతో తొలగించి, రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన ఓటు హక్కును ధ్వంసం చేసి "ఓటు చోరీ" కి పాల్పడిన కేంద్ర ఎన్నికల చీఫ్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తన పదవికి అనర్హుడు, భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును చోరీ చేసిన దేశద్రోహి, అతన్ని తక్షణమే అరెస్టు చేసి జైల్లో పెట్టాలని, ఇప్పటికే తొలగించిన ఓటర్లను తిరిగి జాబితాలో చేర్చి ఓటు హక్కు కాపాడాలని రేణిగుంట వామపక్ష పార్టీలు సిపిఎం, సిపిఐ డిమాండ్ చేశారు.

అక్టోబర్ 10న చలో ఢిల్లీ పిలుపులో భాగంగా "ఓటు చోరీ" చేసిన ఎన్నికల చీఫ్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ను పదవి నుండి తప్పించాలి అదేవిధంగా అరెస్ట్ చేయాలని శాంతియుతంగా జంతర్ మంతర్ వద్ద యువత, వామపక్ష విద్యార్థి నేతలు నిరసన తెలుపుతుంటే కేంద్ర ప్రభుత్వం, పోలీసులు, మిలిటరీ బలగాలను మోహరించి విచక్షణారహితంగా లాఠీ ఛార్జ్ చేయడం, విద్యార్థి నేతలను నిర్బంధించడాన్ని ఖండిస్తూ.. ఆదివారం నాడు రేణిగుంట అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్ష పార్టీలు నిరసన ధర్నా చేపట్టారు.

ఓటు హక్కు ప్రతి భారతీయుల సంపద, ఓటు హక్కును కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అందుకే మహాత్మా గాంధీ ఉద్యమ స్ఫూర్తితో.. భగత్ సింగ్ రగిలించిన విప్లవం వారసులుగా నేటి యువత ఢిల్లీలో చేసే పోరాటం స్ఫూర్తితో "ప్రజాస్వామ్యాన్ని" రక్షించుకోవడానికి పోరాడుతామని ప్రతిజ్ఞ చేశారు. ఢిల్లీలో యువత, వామపక్ష విద్యార్థి నేతలు చేసే పోరాటానికి ప్రజలందరూ మద్దతుగా నిలవాలని ఓట్లు దొంగలించే కేంద్ర బిజెపి ప్రభుత్వాన్ని అధికారం నుంచి గద్దె దించి తన్ని తరిమేయాలని పిలుపు ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల కార్యదర్శి వైయస్ మణి, మురళి, రజాక్, రమణ, అమ్ములు, దాము, గిరి, వరలక్ష్మి, సిపిఎం పార్టీ ప్రాంతీయ కమిటీ కన్వీనర్ కొండ్రెడ్డి హరినాథ్, వెంకటరమణ, శివానందం, ఈశ్వరమ్మ, సత్య శ్రీ, సెల్వరాజ్, దిలీప్ భాషా, మునిస్వామి, అమ్ములు, దస్తగిరి, రాముడు తదితరుల పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA