Renigunta: రేణిగుంటలో మంచం గుర్తుకు ఓటేయాలి: జనసేన మిథున్ శాలి

Renigunta: రేణిగుంట పంచాయతీ కూటమి సర్పంచ్ అభ్యర్థి కె. చిత్రకు మద్దతుగా ర్యాలీ; వరుస నంబర్ 1 మంచం గుర్తుకు ఓటేయాలని జనసేన నేత మిథున్ శాలి విజ్ఞప్తి.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 24 Nov 2026 5:44 PM IST
Renigunta
X

Renigunta: రేణిగుంటలో మంచం గుర్తుకు ఓటేయాలి: జనసేన మిథున్ శాలి

రేణిగుంట: రేణిగుంట గ్రామపంచాయతీ కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కె. చిత్రకు మద్దతుగా జనసేన పార్టీ నాయకులు, కూటమి నాయకులుతొ కలిసి ర్యాలీ నిర్వహించారు. రేణిగుంట జనసేన నాయకుడు మిథున్ శాలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో జనసేన శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలను కలుసుకుంటూ ఎన్నికల్లో వరుస నంబర్ 1లో ఉన్న మంచం గుర్తుకు ఓటు వేసి కె. చిత్రను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కూటమి అభ్యర్థి విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

ర్యాలీతో రేణిగుంటలో ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకుంది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA