Renigunta: రేణిగుంటలో జనసేన ఆత్మీయ భేటీ.. స్థానిక కోటాలో నో కాంప్రమైజ్
Renigunta: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనకు సముచిత స్థానం దక్కేలా కృషి చేస్తామని రేణిగుంట ఆత్మీయ సమావేశంలో తిరుపతి సమన్వయకర్త మిద్దెల హరి స్పష్టం చేశారు.
Renigunta: రేణిగుంటలో జనసేన ఆత్మీయ భేటీ.. స్థానిక కోటాలో నో కాంప్రమైజ్
రేణిగుంట: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీకి తగిన ప్రాతినిధ్యం కల్పించేలా కృషి చేస్తామని తిరుపతి పార్లమెంట్ సమన్వయకర్త మిద్దెల హరి తెలిపారు.
రేణిగుంట మండల అధ్యక్షుడు చినతోటి నాగరాజు, పట్టణ అధ్యక్షురాలు ఆకుల భాగ్యలక్ష్మి ఆహ్వానం మేరకు స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల సమస్యలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు.
కూటమి పార్టీలతో సమన్వయం చేసుకుంటూ జనసేనకు తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు పార్లమెంట్ కమిటీ ద్వారా పరిశీలిస్తామని మిద్దెల హరి పేర్కొన్నారు. జనసైనికులు, నాయకులు, వీర మహిళలకు అండగా ఉంటూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని సత్రవాడ ప్రవీణ్ తెలిపారు.
ఈ సందర్భంగా తిరుపతి పార్లమెంట్ నిర్వహణ దళ సభ్యుడిగా నియమితులైన చినతోటి నాగరాజును శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.




