Tirupati: స్వచ్ఛతకు పెద్దపీట: రేణిగుంట మండలంలో లక్కీ డిప్ ఆఫర్!
Tirupati: రేణిగుంటలో దసరా సందర్భంగా వినూత్న కార్యక్రమం చేపట్టారు. స్వచ్ఛ రథానికి 3 కిలోల పొడి చెత్త ఇస్తే లక్కీ డిప్ కూపన్లు అందజేస్తామని ఎంపీడీఓ తెలిపారు.
Tirupati: స్వచ్ఛతకు పెద్దపీట: రేణిగుంట మండలంలో లక్కీ డిప్ ఆఫర్!
Tirupati: దసరా పండుగను పురస్కరించుకుని రేణిగుంట మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఎంపీడీఓ రవి చంద్ర తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 26 వరకు స్వచ్ఛ రథానికి 3 కిలోలకు పైగా పొడి చెత్త (డ్రై వేస్ట్) అందజేసే వారికి కూపన్లు అందజేయనున్నారు.
అనంతరం అక్టోబర్ 26న గ్రామ పంచాయతీల వారీగా లక్కీడిప్ నిర్వహించి ఎంపికైన వారికి మూడు ప్రత్యేక బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు.
ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పొడి చెత్తను స్వచ్ఛ రథానికి అందజేసి గ్రామాల పరిశుభ్రతకు సహకరించాలని ఎంపీడీఓ,డిప్యూటీ ఎంపీడీఓలు కోరారు.




