Renigunta: రేణిగుంటలో జడ్పీటీసీ ఇద్దరి మధ్య పోటీ నాలుగు ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు!

Renigunta: రేణిగుంట మండలంలో జడ్పీటీసీ స్థానానికి బీజేపీ, వైఎస్‌ఆర్‌సీపీ మధ్య హోరాహోరీ పోరు. 17 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం, 4 స్థానాలకు ఎన్నికలు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 27 Oct 2026 6:08 PM IST
Renigunta
X

Renigunta: రేణిగుంటలో జడ్పీటీసీ ఇద్దరి మధ్య పోటీ నాలుగు ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు!

రేణిగుంట: రేణిగుంట మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. జడ్పీటీసీ స్థానానికి ఇద్దరు అభ్యర్థులు పోటీలో నిలిచారు. బీజేపీ తరఫున జీపాలెం తేజోవతి, వైఎస్సార్‌సీపీ తరఫున గంగారి సుజాత బీ-ఫారాలు అందుకోవడంతో వీరిద్దరి మధ్య ప్రధాన పోటీ జరగనుంది.

మండలంలోని మొత్తం 21 ఎంపీటీసీ స్థానాలకు గాను కూటమి నాయకులు 17 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రేణిగుంట సెగ్మెంట్‌-3, సెగ్మెంట్‌-5తో పాటు సూరప్ప కసం , గుత్తివారిపల్లి ఎంపీటీసీ స్థానాల్లో అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది.

దీంతో మండలంలో జడ్పీటీసీ స్థానంతో పాటు నాలుగు ఎంపీటీసీ స్థానాలకు జరగనున్న ఎన్నికల ఫలితాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA