Renigunta: రేణిగుంటలో ఉచిత వైద్య శిబిరం.. విశేష స్పందన
Renigunta: రేణిగుంట జి.ఎం. స్ట్రీట్ అభయ వినాయక చవితి ఉత్సవాల్లో సన్‌రైజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంప్‌కు విశేష స్పందన లభించింది.
Renigunta: రేణిగుంటలో ఉచిత వైద్య శిబిరం.. విశేష స్పందన
Renigunta: రేణిగుంట పట్టణంలోని జి ఎం స్ట్రీట్ లో శ్రీ అభయ వినాయక అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న వినాయక చవితి మహోత్సవాలలో భాగంగా ఆరవ రోజు శనివారం సన్రైజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత మెడికల్ క్యాంప్
కు విశేష స్పందన లభించింది. సన్రైజ్ హాస్పిటల్ చైర్మన్ ఎస్.బి.ఆర్ భాష, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సందీప్ రెడ్డి సౌజన్యంతో నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంపు లో అధిక మంది పాల్గొని చికిత్సను పొందారు.
అవసరమైన వారికి షుగర్, బిపి, జనరల్ చెకప్ చేసి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అనంతరం అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ సందీప్ రెడ్డి ని ఘనంగా సత్కరించి ప్రసాదాలను అందించారు.
ఈ సందర్భంగా డాక్టర్ సందీప్ రెడ్డి మాట్లాడుతూ వినాయక చవితి మహోత్సవాలలో మా హాస్పిటల్ తరఫున మెడికల్ క్యాంపు నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. రేణిగుంటలో నూతనంగా ఏర్పడిన సన్రైజ్ హాస్పిటల్ లో అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉందని తెలిపారు.
శ్రీ అభయ వినాయక అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు జూలియన్ రాజు మాట్లాడుతూ సన్రైజ్ హాస్పిటల్ సౌజన్యంతో మెడికల్ క్యాంపు నిర్వహించడం అభినందనీయమన్నారు. నిపుణులైన వైద్యులు పరీక్షించి ఉచితంగా మందులను పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. మెడికల్ క్యాంపు నిర్వహించిన హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ యోగానంద్, డాక్టర్ గోపికృష్ణ, హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్లు పురుషోత్తం, తేజ, అభయ వినాయక అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మణ్, సుమన్, కళ్యాణ్, పవన్, ప్రభు, మురళి, ధనుంజయ్, హేమాద్రి, మస్తాన్, ప్రదీప్, సుబ్బు హాస్పిటల్ సిబ్బంది దినేష్, సేలం, ఈశ్వరి, సుజాత తదితరులు పాల్గొన్నారు.




