Tirupati: రేణిగుంటలో టౌన్ సర్వీసులు లేక ప్రయాణికుల తీవ్ర అవస్థలు!
Tirupati: తిరుపతి జిల్లా రేణిగుంటలో టౌన్ సర్వీస్ బస్సులు సక్రమంగా రాక ప్రయాణికుల అవస్థలు. పల్లె వెలుగు బస్సుల్లో రద్దీ, ఆటోల అధిక ఛార్జీలతో ఇబ్బందులు.
Tirupati: రేణిగుంటలో టౌన్ సర్వీసులు లేక ప్రయాణికుల తీవ్ర అవస్థలు!
Tirupati: రేణిగుంట ఆర్టీసీ బస్టాండ్‌కు గత కొన్ని రోజులుగా టౌన్ సర్వీస్ బస్సులు సక్రమంగా రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో పల్లె వెలుగు బస్సులను ఆశ్రయించాల్సి వస్తోంది.
టౌన్ సర్వీసులు అందుబాటులో లేకపోవడంతో పల్లె వెలుగు బస్సుల్లో రద్దీ పెరుగుతోంది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సుల కోసం ప్రయాణికులు నిరీక్షించాల్సి వస్తోందని వాపోతున్నారు. రద్దీ కారణంగా వృద్ధులు, మహిళలు, విద్యార్థులు మరింత ఇబ్బందులు పడుతున్నట్లు చెబుతున్నారు.
ఈ సమస్యను ఆసరాగా చేసుకున్నా కొందరు ఆటో డ్రైవర్ లు ప్రయాణికుల వద్ద అందిన కాడికి దండుకుంటూ దోచుకుంటూ వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేణిగుంట మండల సర్వసభ్య సమావేశాల్లో గతంలో పలుమార్లు అన్ని పార్టీల నాయకులు టౌన్ సర్వీసుల సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదని ప్రయాణికులు పేర్కొంటున్నారు.
పట్టణ ప్రజల రవాణా సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని టౌన్ సర్వీసులను వెంటనే పునరుద్ధరించి, అవసరమైన సంఖ్యలో బస్సులు నడపాలని ప్రయాణికులు ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు. టౌన్ సర్వీసుల కొరతకు కారణం ఏపీఎస్‌ఆర్టీసీ నిర్వహణలోపమా? లేక స్థానిక పాలకుల నిర్లక్ష్యమా? అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. సమస్యపై ఆర్టీసీ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.




