Renigunta: రేణిగుంట 6, 8 వార్డుల్లో కారు మస్తాన్ కుటుంబం ఘన విజయం
Renigunta: రేణిగుంట పట్టణం బుగ్గ వీధికి చెందిన కారు మస్తాన్ కుటుంబం పంచాయతీ ఎన్నికల్లో 6, 8వ వార్డుల్లో ఘన విజయం సాధించింది. ఎస్. రబ్బానీ, ఎస్. సాజిదా గెలుపు.
Renigunta: రేణిగుంట 6, 8 వార్డుల్లో కారు మస్తాన్ కుటుంబం ఘన విజయం
రేణిగుంట: రేణిగుంట పట్టణంలోని బుగ్గ వీధికి చెందిన కారు మస్తాన్ కుటుంబం స్థానిక ఎన్నికల్లో మరోసారి తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది. 20 ఏళ్లుగా విజయ పరంపర కొనసాగిస్తున్న తండ్రికి తగ్గ తనయుల కుటుంబం అధికార పక్షానికి ముచ్చెమటలు పట్టించింది.
బ్రదర్స్, ప్రస్తుత పంచాయతీ ఫలితాల్లో 6వ వార్డు నుంచి మాజీ మెంబర్ ఎస్. రిజ్వాన్ కుమారుడు ఎస్. రబ్బానీ 50 ఓట్ల మెజారిటీతో, 8వ వార్డు నుంచి మాజీ వైస్ సర్పంచ్ ఎస్. ఇర్ఫాన్ సతీమణి ఎస్. సాజిదా 160 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. రెండు దశాబ్దాల ప్రజాసేవే ఈ డబుల్ విజయానికి కారణమని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు




