Renigunta: రేణిగుంటలో 19 పంచాయతీలు.. 60 మంది సర్పంచ్ అభ్యర్థులు
Renigunta: రేణిగుంట మండలంలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు 19 పంచాయతీల్లో 60 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో; కరకంబాడి, జీపాలెంలో చెరో 8 మంది పోటీ.
Renigunta: రేణిగుంటలో 19 పంచాయతీలు.. 60 మంది సర్పంచ్ అభ్యర్థులు
రేణిగుంట: రెండో సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు–2026లో భాగంగా తొలి విడతలో నిర్వహించనున్న ఎన్నికలకు సంబంధించి రేణిగుంట మండలంలోని పంచాయతీల వారీగా పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థుల వివరాలు వెల్లడయ్యాయి. శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలోని రేణిగుంట మండలంలో మొత్తం 19 గ్రామ పంచాయతీలు ఉండగా, వాటిలో సర్పంచ్ పదవులకు మొత్తం 60 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు అధికారిక వివరాలు వెల్లడిస్తున్నాయి.
మండలంలోని అతిపెద్ద పంచాయతీగా రేణిగుంటలో 20 వార్డులు ఉండగా, సర్పంచ్ పదవికి నలుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కరకంబాడి, జీపాలెం పంచాయతీల్లో అత్యధికంగా ఎనిమిది మంది చొప్పున అభ్యర్థులు బరిలో ఉన్నారు. తూకివాకం పంచాయతీలో ఆరుగురు, సూరప్పకాసంలో ఐదుగురు, మామండూరులో నలుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు.




