Renigunta: రేణిగుంట బుగ్గ వీధిలో ద్విచక్ర వాహనం హల్చల్.. బాలుడికి తీవ్ర గాయాలు
Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట బుగ్గ వీధిలో స్కూటర్ అతివేగంగా నడిపి ఐదేళ్ల బాలుడు షేక్ మహ్మద్ అద్నాన్ను ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి.
Renigunta: రేణిగుంట బుగ్గ వీధిలో ద్విచక్ర వాహనం హల్చల్.. బాలుడికి తీవ్ర గాయాలు
రేణిగుంట: పట్టణంలోని బుగ్గ వీధిలో మైనర్లు, యువకులు స్కూటర్లపై అతివేగంగా, నిర్లక్ష్యంగా తిరుగుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు వీధుల్లోకి రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి నెలకొంది.
ఈ క్రమంలో శనివారం ఇంటి ముందు ఆడుకుంటున్న ఐదేళ్ల బాలుడిని కాలేషా అనే యువకుడు అతివేగంగా స్కూటర్ నడుపుతూ ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో షేక్ మహ్మద్ అద్నాన్ బాలుడికి తీవ్ర కి గాయాలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై, హుటాహుటిన బాలుడిని ఆసుపత్రికి తరలించారు.
వీధుల్లో వాహనాలను విచ్చలవిడిగా, అతివేగంగా నడుపుతూ ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్న వారిపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ముఖ్యంగా మైనర్లు వాహనాలు నడపకుండా పర్యవేక్షణ పెంచడంతో పాటు, బుగ్గ వీధిలో వేగ నియంత్రణ చర్యలు చేపట్టి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.




