Renigunta: రేణిగుంట 19 పంచాయతీల్లో ఇప్పటివరకు 48 నామినేషన్లు దాఖలు!
Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట మండల పరిధిలోని 19 గ్రామ పంచాయతీలకు సంబంధించి నవంబర్ 16 నాటికి సర్పంచ్ స్థానాలకు 15, వార్డు సభ్యులకు 33 కలిపి మొత్తం 48 నామినేషన్లు దాఖలయ్యాయి.
Renigunta: రేణిగుంట 19 పంచాయతీల్లో ఇప్పటివరకు 48 నామినేషన్లు దాఖలు!
రేణిగుంట: గ్రామ పంచాయతీ రెండవ సాధారణ ఎన్నికలు–2026కు సంబంధించి నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నవంబర్ 16వ తేదీ నాటికి దాఖలైన నామినేషన్ల వివరాలను ఎన్నికల అధికారులు వెల్లడించారు. రేణిగుంట మండల పరిధిలోని మొత్తం 19 గ్రామ పంచాయతీలకు సంబంధించిన నామినేషన్ల సారాంశాన్ని విడుదల చేశారు.
విడుదల చేసిన వివరాల ప్రకారం వార్డు సభ్యుల స్థానాలకు మొత్తం 33 నామినేషన్లు దాఖలయ్యాయి.15 సర్పంచ్ స్థానాలతో కలిపి అన్ని స్థానాలకు సంబంధించి మొత్తం 48 నామినేషన్లు నమోదైనట్లు వెల్లడించారు. నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల సంఖ్యపై ఆసక్తి నెలకొంది.




