Renigunta: గురవరాజుపల్లి సర్పంచ్ రేసులో బీజేపీ నాయకుడు రాజా రాయల్?
Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట మండలం గురవరాజుపల్లి సర్పంచ్ స్థానం అన్‌రిజర్వ్‌డ్ కావడంతో రాజకీయాలు వేడెక్కాయి.
Renigunta: గురవరాజుపల్లి సర్పంచ్ రేసులో బీజేపీ నాయకుడు రాజా రాయల్?
Renigunta: రేణిగుంట మండలం గురవరాజుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానం అన్‌రిజర్వుడ్ కేటగిరీకి కేటాయించడంతో గ్రామ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ మండల ఉపాధ్యక్షుడు రాజా రాయల్‌కు కూటమి సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం దక్కుతుందా? లేక టీడీపీ నుంచి మరో అభ్యర్థి బరిలోకి దిగుతారా? అన్న చర్చ స్థానిక రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
రామకృష్ణాపురం గ్రామానికి చెందిన రాజా రాయల్‌కు రేణిగుంట మండలంతో పాటు పరిసర ప్రాంతాల్లో రాజకీయ, సామాజిక పరిచయాలు ఉన్నాయి. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కోలా ఆనంద్‌తో ఆయనకు ఉన్న సన్నిహిత సంబంధాలు కూడా ఆయన అభ్యర్థిత్వంపై చర్చకు కారణమవుతున్నాయి.
గతంలో వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్న సమయంలోనూ గురవరాజుపల్లి పంచాయతీలో రాజా రాయల్ కుటుంబ సభ్యురాలు వార్డు సభ్యురాలిగా విజయం సాధించడం ఆయన కుటుంబానికి గ్రామంలో ఉన్న రాజకీయ పరిచయాలను తెలియజేస్తోందని అనుచరులు పేర్కొంటున్నారు. పార్టీలకు అతీతంగా స్థానికులతో సత్సంబంధాలు కొనసాగించడం, ప్రజల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందించడం ఆయనకు అనుకూలంగా మారవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అన్‌రిజర్వుడ్ కేటగిరీ కావడంతో పోటీకి అవకాశాలు విస్తరించిన నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య అభ్యర్థి ఎంపిక కీలకంగా మారనుంది. బీజేపీ రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులతో పాటు స్థానిక నాయకుల మద్దతు రాజా రాయల్‌కు లభిస్తుందా? కూటమి నాయకత్వం ఆయన పేరును పరిశీలిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
అయితే సర్పంచ్ అభ్యర్థి ఎంపికలో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, స్థానిక రాజకీయ సమీకరణాలు కీలక పాత్ర పోషించనున్నాయి. గురవరాజుపల్లి స్థానం బీజేపీకి దక్కుతుందా? టీడీపీ అభ్యర్థికి అవకాశం లభిస్తుందా? అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
అన్‌రిజర్వుడ్ స్థానం.. రాజా రాయల్‌కు కలిసొచ్చేనా? గురవరాజుపల్లి సర్పంచ్ అభ్యర్థిగా ఆయనకు అవకాశం దక్కుతుందా? లేక కూటమి మరో పేరును ఖరారు చేస్తుందా? అన్నది అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే స్పష్టత రానుంది. అప్పటివరకు గురవరాజుపల్లి సర్పంచ్ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగనుంది.




