Tirupati: అంతర్ జిల్లాల పోటీల్లో సత్తా చాటిన 11 మంది విద్యార్థులు!

Tirupati: తిరుపతి జిల్లా రేణిగుంట రెయిన్‌బో స్కూల్‌కు చెందిన 11 మంది విద్యార్థులు అంతర్ జిల్లాల జంప్ రోప్ పోటీల్లో ప్రతిభ చాటి జాతీయ స్థాయికి ఎంపిక.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 29 Sept 2026 2:04 PM IST
Tirupati
X

Tirupati: అంతర్ జిల్లాల పోటీల్లో సత్తా చాటిన 11 మంది విద్యార్థులు!

Tirupati: అన్నమయ్య జంప్ రోప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 8వ సబ్‌-జూనియర్ ఇంటర్‌-డిస్ట్రిక్ట్ జంప్ రోప్ ఛాంపియన్‌షిప్–ఆంధ్రప్రదేశ్ పోటీల్లో రెయిన్‌బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

అండర్‌-12, అండర్‌-14 విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో రెయిన్‌బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్‌కు చెందిన మొత్తం 11 మంది విద్యార్థులు ప్రతిభ కనబరిచి నేషనల్స్‌కు ఎంపిక కావడం పట్ల పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థులు:

బాలికల విభాగం: దీప్తి హనీ కె., కీర్తి కె., కారుణ్య ఎస్., దీపాన్విత కె., ప్రణవి కె., జ్ఞాపిక ఎన్. బాలుర విభాగం: కె.ఎం.డి. రిహాన్, దీక్షిత్ కుమార్, ఎస్. ముస్తఫా, ఎండి. ఖదీర్, బి. ఎస్లినక్షత్ర.

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పి.అత్తా ఉల్లా ఖాన్ మాట్లాడుతూ విద్యార్థులకు అంకితభావంతో శిక్షణ అందించిన కోచ్ రెడ్డికి, అలాగే విద్యార్థుల క్రీడా ప్రతిభను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.

జాతీయ స్థాయి పోటీల్లోనూ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రెయిన్‌బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి గుర్తింపు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA