Railway Koduru: రైల్వే కోడూరులో కూటమి భారీ ర్యాలీ.. ముగిసిన ప్రచార పర్వం
Railway Koduru: రైల్వే కోడూరు పంచాయతీ ఎన్నికల ప్రచార ముగింపు సందర్భంగా ఎన్డీఏ సర్పంచ్ అభ్యర్థి మల్లిశెట్టి ధీమతి భారీ ర్యాలీ; ముక్కా రూపానంద రెడ్డి దంపతుల హాజరు.
Railway Koduru: రైల్వే కోడూరులో కూటమి భారీ ర్యాలీ.. ముగిసిన ప్రచార పర్వం
రైల్వే కోడూరు: రైల్వే కోడూరు గ్రామ పంచాయతీ ఎన్నికల సమరంలో భాగంగా ప్రచార పర్వానికి అట్టహాసంగా తెరపడింది. మంగళవారం ప్రచార ఘట్టం ముగియనున్న నేపథ్యంలో ఎన్డీఏ కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని మల్లిశెట్టి ధీమతి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీతో రైల్వే కోడూరు పురవీధులు జనసంద్రంగా మారాయి.
స్థానిక మల్లిశెట్టి వారి నివాసం నుండి ప్రారంభమైన ఈ మహా ప్రదర్శన, కూటమి శ్రేణుల నినాదాలు, కార్యకర్తల కోలాహలం నడుమ ఎన్టీఆర్ విగ్రహం వరకు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. ఈ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మల్లిశెట్టి ధీమతికి ఎన్నికల సంఘం ‘ఉంగరం’ గుర్తును కేటాయించగా, ఆ గుర్తుకు ఓటు వేసి ఆమెను అఖండ మెజారిటీతో గెలిపించాలని నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ ప్రచార ర్యాలీకి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రైల్వే కోడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ , కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి వారి సతీమణి ముక్కా వరలక్ష్మి,ఓబులవారిపల్లి ఎంపీపీ ముక్కా సాయి వికాస్ రెడ్డి, రైల్వే కోడూరు మండల్ ఎంపీ తాతంశెట్టి తులసి,జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, జయప్రకాశ్, వైస్ ఎంపీపీ అరవింద్, తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.
ఈ సందర్భంగా ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ, రైల్వే కోడూరు గ్రామ పంచాయతీ సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన చారిత్రక అవసరం ఉందని పేర్కొన్నారు. కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులన్నీ ఐక్యమత్యంతో పనిచేసి ఉంగరం గుర్తుపై ఓటు వేయించి మల్లిశెట్టి ధీమతిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, తద్వారా పంచాయతీలో ప్రగతికి కొత్త బాటలు వేయవచ్చని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల ముఖ్య నాయకులు, ఎంపీటీసీలు,కార్యకర్తలు, మహిళలు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు.




