Puttur: రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
Puttur: పుత్తూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మహేష్ మృతి చెందగా, మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Puttur: రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
పుత్తూరు: తిరుపతి జిల్లా పుత్తూరు పట్టణ సమీపంలోని గోవిందపాలెం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందగా, మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి.
గంగవరం, అనంతపురం ప్రాంతాలకు చెందిన మహేష్, మరో విద్యార్థి పుత్తూరులోని ఎస్వీపీసెట్ కళాశాలలో సీఎస్‌ఈ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. వీరిద్దరూ బంధువులుగా సమాచారం. బుధవారం ద్విచక్ర వాహనంపై పుత్తూరు నుంచి తిరుపతి వైపు బైపాస్ రోడ్డులో వెళ్తుండగా గోవిందపాలెం వద్ద ప్రమాదం జరిగింది.
రెండు లారీల మధ్య నుంచి ద్విచక్ర వాహనం వెళ్లే క్రమంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మహేష్ అక్కడికక్కడే మృతి చెందాడు.
మరో విద్యార్థికి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తూ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.




