Renigunta: రేణిగుంట సబ్ డివిజన్ పరిధిలో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత!

Renigunta: రేణిగుంట సబ్‌ డివిజన్ పరిధిలో నిర్వహణ పనుల నేపథ్యంలో రేపు (అక్టోబర్ 10) ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేత.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 9 Oct 2026 12:23 PM IST
Renigunta
X

Renigunta: రేణిగుంట సబ్ డివిజన్ పరిధిలో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత!

Renigunta: రేణిగుంట సబ్‌ డివిజన్ పరిధిలో విద్యుత్ లైన్లు, ఎల్‌టీ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లకు సంబంధించిన నిర్వహణ పనుల నేపథ్యంలో రేపు (అక్టోబర్ 10) విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.

రేణిగుంట సబ్‌ డివిజన్ పరిధిలోని 33/11 కేవీ తూకివాకం, కరకంబాడి, గురవరాజుపల్లి, యలమండ్యం, గాజులమండ్యం సబ్‌స్టేషన్ల పరిధిలో విద్యుత్ లైన్లు, ఎల్‌టీ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణ పనులు చేపట్టనున్నారు.

ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏపీఎస్‌పీడీసీఎల్ రేణిగుంట డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వి. రమేష్ బాబు తెలిపారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA