Tirupati: చంద్రగిరి పరిధిలో ప్రశాంతంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్!

Tirupati: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తిరుచానూరు మేజర్ పంచాయతీతో పాటు తిరుపతి రూరల్ మండలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది.

K VENU, TIRUPATHI RURAL
Published on: 5 Nov 2026 9:32 AM IST
Tirupati
X

Tirupati: చంద్రగిరి పరిధిలో ప్రశాంతంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్!

Tirupati: తిరుపతి రూరల్ (మండలం) మండలవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, వివాదాలు తలెత్తకుండా పోలీసు, రెవెన్యూ యంత్రాంగంతో పాటు ఆయా పంచాయతీ అధికారులు సమన్వయంతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

పోలీస్ ఉన్నతాధికారులు మండలంలోని సమస్యాత్మక ప్రాంతాలతో పాటు అన్ని పోలింగ్ బూత్‌లను క్షేత్రస్థాయిలో స్వయంగా సందర్శించి భద్రతా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఓటర్లు ఎటువంటి భయభ్రాంతులకు గురికాకుండా నిర్భయంగా, ప్రశాంత వాతావరణంలో ఓటు వేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినా, కేంద్రాల వద్ద అల్లర్లు లేదా ఘర్షణలకు దిగినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL