Renigunta: రేణిగుంటలో పోలింగ్ సిబ్బందికి మధ్యాహ్నం 3 గంటలైన భోజనం కరువు

Renigunta: రేణిగుంట బాలుర ఉన్నత పాఠశాలలోని పోలింగ్ బూత్‌లలో సిబ్బందికి మధ్యాహ్నం 3 గంటలైనా భోజనం అందకపోవడంతో ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకుని తిన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 5 Nov 2026 3:37 PM IST
Renigunta
X

Renigunta: రేణిగుంటలో పోలింగ్ సిబ్బందికి మధ్యాహ్నం 3 గంటలైన భోజనం కరువు

రేణిగుంట: రేణిగుంటలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 27, 28, 29, 30, 31, 32 నంబర్ల పోలింగ్ బూత్‌లలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు, పోలింగ్ సిబ్బందికి కనీస భోజన సదుపాయాలు కల్పించకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. ఉదయం నుంచి ఎన్నికల విధుల్లో నిమగ్నమైన సిబ్బందికి భోజన ఏర్పాట్లు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు వాపోతున్నారు.

అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన సిబ్బంది, చేసేదిలేక ఆన్‌లైన్‌లో సొంతంగా భోజనం ఆర్డర్ చేసుకుని తినాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఎన్నికల విధుల్లో కీలకంగా పనిచేస్తున్న సిబ్బందికి కనీస భోజన సదుపాయాలు కూడా కల్పించకపోవడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విధుల్లో ఉన్న సిబ్బంది సంక్షేమంపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA