Thottambedu: తొట్టంబేడు మండలంలో అక్రమ మద్యం కలకలం!

Thottambedu: తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం పెన్నలపాడులో పోలీసుల ఆకస్మిక దాడి. ఎన్నికల వేళ ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 47 లీటర్ల మద్యం (260 బాటిళ్లు) స్వాధీనం, ఒకరి అరెస్ట్.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 2 Nov 2026 1:53 PM IST
Thottambedu
X

Thottambedu: తొట్టంబేడు మండలంలో అక్రమ మద్యం కలకలం!

Thottambedu: తొట్టంబేడు మండలంలో అక్రమ మద్యం నిల్వపై పోలీసులు దాడులు నిర్వహించారు. పెన్నలపాడు గ్రామంలోని ఓ ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన 47 లీటర్ల మద్యాన్ని (260 బాటిళ్లు) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో సదరు ఇంటిపై పోలీసులు ఆకస్మికంగా దాడి చేయగా ఈ అక్రమ మద్యం నిల్వ వెలుగులోకి వచ్చింది.

సుమారు రూ.40 వేల విలువైన 260 మద్యం బాటిళ్లను పోలీసులు సీజ్ చేశారు. పోలీసుల రాకను గమనించిన ఇద్దరిలో ఒకరు అక్కడి నుంచి పరారవగా, మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల సమయంలో ఓటర్లకు పంపిణీ చేసేందుకు ఈ మద్యం బాటిళ్లను నిల్వ ఉంచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టయిన నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. ఎన్నికల వేళ అక్రమ మద్యం నిల్వలు, పంపిణీపై పోలీసులు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI