Gajulamandyam: పోలీసుల నోటీసులపై వైఎస్సార్‌సీపీ శ్రేణుల తీవ్ర అభ్యంతరం!

Gajulamandyam: తిరుపతి జిల్లా గాజులమండ్యంలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత సిద్ధగుంట సుధాకర్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 21 Oct 2026 9:04 AM IST
Gajulamandyam
X

Gajulamandyam: పోలీసుల నోటీసులపై వైఎస్సార్‌సీపీ శ్రేణుల తీవ్ర అభ్యంతరం!

Gajulamandyam: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సిద్ధగుంట సుధాకర్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు చెబుతున్నప్పటికీ, ఈ చర్యపై రేణిగుంట వైసీపీ నాయకులు, కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో రాజకీయ నాయకులకు నోటీసులు జారీ చేయడం సరైన పద్ధతి కాదని వైసీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ఎన్నికల ప్రక్రియలో అన్ని పార్టీల పట్ల సమానంగా వ్యవహరించాలని, ఎలాంటి వివక్షకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, రాజకీయ నాయకులకు నోటీసులు జారీ చేసే విషయంలో నిబంధనలను పారదర్శకంగా అమలు చేయాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA