Renigunta: రౌడీ షీటర్లకు గాజులమండ్యం సీఐ కౌన్సెలింగ్!

Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట పరిధిలోని గాజులమండ్యం పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీటర్లకు సీఐ మంజునాథ రెడ్డి ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Updated on: 4 Oct 2026 7:01 PM IST
Renigunta
X

Renigunta: రౌడీ షీటర్లకు గాజులమండ్యం సీఐ కౌన్సెలింగ్!

Renigunta: తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, రేణిగుంట ఎస్‌డీపీఓ శ్రీనివాసరావు పర్యవేక్షణలో సీఐ మంజునాథ రెడ్డి గాజులమండ్యం పోలీసు స్టేషన్ లో రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రౌడీ షీటర్లు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని సీఐ సూచించారు.

ఎలాంటి నేరాలకు పాల్పడకుండా చట్టాన్ని గౌరవిస్తూ బాధ్యతాయుతంగా జీవించాలని ఆయన హితవు పలికారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా వ్యవహరిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో ఎస్‌ఐ హరీష,సిబ్బంది కలిసి పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA