Tirupati: ముస్లింపాలెంలో ఆపరేషన్ త్రిశూల్: పోలీసుల అవగాహన

Tirupati: తిరుపతి జిల్లా ముస్లింపాలెంలో 'ఆపరేషన్ త్రిశూల్' ద్వారా మహిళా రక్షణ, గంజాయి నిర్మూలన, రోడ్డు భద్రతపై ఎస్సై మల్లికార్జున నాయుడు అవగాహన కల్పించారు.

K. SURESH BABU, SATYAVEDU
Published on: 24 Sept 2026 10:31 PM IST
Tirupati
X

Tirupati: ముస్లింపాలెంలో ఆపరేషన్ త్రిశూల్: పోలీసుల అవగాహన

Tirupati: నేరాన్ని అరికట్టడం పోలీసుల బాధ్యత అయితే.. నేర రహిత సమాజాన్ని నిర్మించడం ప్రతి ఒక్కరి బాధ్యత!” అనే సందేశంతో ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా వరదయ్యపాలెం మండలం ముస్లింపాలెం గ్రామపంచాయతీలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

తిరుపతి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, పుత్తూరు డీఎస్పీ మరియు సత్యవేడు సీఐ పర్యవేక్షణలో ఎస్సై మల్లికార్జున నాయుడు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

మహిళలు, యువత, గ్రామ ప్రజలకు మహిళా భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలన, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.

యువత చేతుల్లో భవిష్యత్తు ఉండాలి.. గంజాయి కాదు!

గంజాయి, ఇతర మాదకద్రవ్యాల మాయలో పడకుండా యువత అప్రమత్తంగా ఉండాలని ఎస్సై మల్లికార్జున నాయుడు సూచించారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు కేవలం పోలీసుల చర్యలు సరిపోవని.. తల్లిదండ్రులు, యువత, గ్రామ ప్రజలు కలిసికట్టుగా ముందుకు వస్తేనే సంపూర్ణ ఫలితం సాధ్యమవుతుందని.... లేకుంటే చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని వివరించారు..

మహిళకు భద్రత.. సమాజానికి గౌరవం!

మహిళల రక్షణకు ఉన్న చట్టాలు, పోలీస్ సహాయ సేవలపై అవగాహన కల్పిస్తూ.. మహిళలు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా భయపడకుండా పోలీసులను సంప్రదించాలని సూచించారు...

హెల్మెట్ ఒక నిబంధన కాదు.. ప్రాణానికి రక్షణ కవచం! అంటూ రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించడం, వాహనం నడిపేటప్పుడు సెల్‌ఫోన్ ఉపయోగించకపోవడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయకపోవడం వంటి నిబంధనలు పాటించాలని సూచించారు.

పోలీసులు–ప్రజలు కలిసి అడుగులు వేస్తేనే సురక్షిత సమాజం సాధ్యం అని పేర్కొంటూ.. ఆపరేషన్ త్రిశూల్ లక్ష్యాలను ప్రజలకు చేరువ చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎస్సై మల్లికార్జున నాయుడు పిలుపునిచ్చారు...

ఏది ఏమైనా:-

భద్రత కోసం పోలీసుల కృషి.. భద్రమైన సమాజం కోసం ప్రజల బాధ్యత..

యువత భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరి సంకల్పం! అనే సందేశంతో కార్యక్రమం కొనసాగింది.

K. SURESH BABU, SATYAVEDU

K. SURESH BABU, SATYAVEDU