Obulavaripalli: రాత్రివేళా జోరుగా కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

Obulavaripalli: యద్దాలవారిపల్లిలో ముక్కా వరలక్ష్మి ఆధ్వర్యంలో రాత్రివేళా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.

PRASAD, KODURU
Updated on: 30 Oct 2026 10:33 PM IST
Obulavaripalli
X

Obulavaripalli: రాత్రివేళా జోరుగా కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

ఓబులువారిపల్లి: రాత్రి వేళైనా లెక్కచేయకుండా ఎన్నికల ప్రచారం కొనసాగింది. యద్దాలవారిపల్లి గ్రామంలో ముక్కా వరలక్ష్మి గారు పర్యటిస్తూ గ్రామ ప్రజలను కలుసుకుని, జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

వై.కోట-2 ఎంపీటీసీ జనసేన అభ్యర్థి కుప్పం పెంచలయ్య గారు, జడ్పీటీసీ అభ్యర్థి కీర్తిపాటి కవిత గారును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ & kuda చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి సతీమణి ముక్కా వరలక్ష్మి గారు గ్రామ ప్రజలను కోరారు.

గ్రామ ప్రజలతో మమేకమవుతూ స్థానిక సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించారు. కూటమి అభ్యర్థులకు ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణను మరింత పెంచేలా నాయకులు, కార్యకర్తలతో కలిసి ఉత్సాహంగా ప్రచారం నిర్వహించారు.

PRASAD, KODURU

PRASAD, KODURU