Srikalahasti: జనన, మరణ ధృవీకరణ పత్రాల కొత్త నిబంధనలపై స్పష్టత ఏది?

Srikalahasti: శ్రీకాళహస్తిలో జనన, మరణ ధృవీకరణ పత్రాల కొత్త నిబంధనలపై స్పష్టత లేకపోవడంతో ప్రజలు పడుతున్న ఇబ్బట్లపై మాజీ కౌన్సిలర్, అడ్వకేట్ కంఠా ఉదయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 8 Oct 2026 4:43 PM IST
Srikalahasti
X

Srikalahasti: జనన, మరణ ధృవీకరణ పత్రాల కొత్త నిబంధనలపై స్పష్టత ఏది?

Srikalahasti: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ 1, 2026 నుండి అమలులోకి తెచ్చిన జనన, మరణాల నమోదు (Birth & Death Certificates) కొత్త నిబంధనలపై స్పష్టత లేకపోవడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని శ్రీకాళహస్తి 14వ వార్డు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మరియు అడ్వకేట్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.

కొత్త నిబంధనల ప్రకారం 2 సంవత్సరాలు దాటిన జనన, మరణ నమోదుకు ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (First Class Judicial Magistrate) కోర్టు ఆదేశాలు తప్పనిసరి అని ప్రభుత్వం ప్రకటనల్లో చెబుతోంది. అయితే, ఇప్పటివరకు ఈ ప్రక్రియకు సంబంధించి కోర్టులకు ఎటువంటి అధికారిక సమాచారం కానీ, అనుసరించాల్సిన పూర్తి పనివిధానం (Standard Operating Procedure / Rules) కానీ అందలేదని ఒక న్యాయవాదిగా మరియు ప్రజాప్రతినిధిగా తాము గమనించామని తెలిపారు.

కోర్టులలో సరైన మార్గదర్శకాలు లేదా స్పష్టమైన జీవోలు లభించకపోవడంతో అధికారులు దరఖాస్తులను స్వీకరించడానికి లేదా పరిష్కరించడానికి వెనుకాడుతున్నారు. దీనివల్ల ధృవీకరణ పత్రాల కోసం కోర్టులు, మున్సిపల్/పంచాయతీ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ప్రజలు తీవ్ర గందరగోళానికి, మానసిక వేదనకు గురవుతున్నారు.

ముందస్తు ప్రణాళిక, కోర్టులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వకుండా హడావుడిగా జీవోలు, నిబంధనలు తీసుకురావడం వల్ల ఈ సమస్య తలెత్తింది. పాఠశాలల ప్రవేశాలు, పాస్పోర్ట్, ఆస్తి వ్యవహారాలు, ఇతర సంక్షేమ పథకాలకు బర్త్, డెత్ సర్టిఫికెట్లు అత్యంత కీలకమైనందున ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

డిమాండ్:

వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మరియు సంబంధిత శాఖల అధికారులు స్పందించి, జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులకు అవసరమైన నిబంధనలు, గైడ్లైన్స్ మరియు పనివిధానాన్ని (Procedure) వెంటనే పంపాలని, ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని శ్రీకాళహస్తి 14వ వార్డు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ & అడ్వకేట్ డిమాండ్ చేశారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI