Chandragiri: ఎన్డీయే కూటమి అంటే ప్రజల కూటమి: ఎమ్మెల్యే పులివర్తి నాని
Chandragiri: ఎన్డీయే ప్రజా కూటమి ప్రభుత్వంలో రూ.90 కోట్ల టీటీడీ నిధులతో ఐతేపల్లి–రంగంపేట 140 అడుగుల రోడ్డు విస్తరణ చేపడుతున్నట్లు ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు.
Chandragiri: ఎన్డీయే కూటమి అంటే ప్రజల కూటమి: ఎమ్మెల్యే పులివర్తి నాని
Chandragiri: లోటు బడ్జెట్ ఉన్నా.. తుడా ఆధ్వర్యంలో చంద్రగిరి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి. రూ. 90 కోట్ల టీటీడీ నిధులతో ఐతేపల్లి – రంగంపేట రోడ్డు విస్తరణ పనుల ప్రారంభం. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 140 అడుగుల రోడ్డు విస్తరణ పనులు. ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు లేకుండా అవసరమైన చోట్ల సర్కిల్స్, సౌకర్యాల ఏర్పాటు, మొదటి విడతలో రూ. 35 కోట్లు, రెండో విడతలో రూ. 25 కోట్లతో ఐతేపల్లి–రంగంపేట బ్రిడ్జిల నిర్మాణం, ఐతేపల్లి–ఒంటెద్దుమట్ట రోడ్డు విస్తరణతో వేగంగా గ్రామాల అభివృద్ధి, దీంతో భూముల విలువలు పెరుగుతాయి.
గత ప్రభుత్వంలో తుడా నిధుల్లో తీవ్ర అవినీతి.. కూటమి ప్రభుత్వంలో ప్రతి పైసా ప్రజలకే ఖర్చు చేస్తుంది. బీసీలకు 34% రిజర్వేషన్లపై ఎన్డీయే కూటమి కట్టుబడి ఉంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు అమలు చేస్తాం.
1985లో ఎన్టీఆర్ బీసీలకు 20%, 1995లో చంద్రబాబు నాయుడు 34% రిజర్వేషన్లు కల్పించారు.వైఎస్సార్‌సీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీసీల హక్కుల పరిరక్షణకు కూటమి కట్టుబడి ఉంటుంది. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




