Tirupati: ఉక్కుమనిషి ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి!

Tirupati: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి పురస్కరించుకుని తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ సమైక్యతా దినోత్సవం.

K VENU, TIRUPATHI RURAL
Published on: 31 Oct 2026 12:18 PM IST
Tirupati
X

Tirupati: ఉక్కుమనిషి ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి!

Tirupati: దేశ సమైక్యత, సమగ్రతకు విశేష కృషి చేసిన స్వాతంత్య్ర సమరయోధుడు, ఉక్కుమనిషి, భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతిని పురస్కరించుకుని జాతీయ సమైక్యతా దినోత్సవం (రాష్ట్రీయ ఏక్తా దివస్) సందర్భంగా శనివారం తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు.

తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, అధ్యక్షతన పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో పోలీస్ అధికారులు, సిబ్బందితో జాతీయ సమైక్యతా ప్రమాణం చేయించారు.

ఈ సందర్భంగా దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడటంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని, కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా జాతీయ సమైక్యతా భావనను పెంపొందించుకోవాలని సందేశమిచ్చారు.

దేశ సమైక్యత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా ఎప్సి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్ (సాయుధ దళం), ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL