Tirupati: నర్సీపట్నం మున్సిపల్ అభ్యర్థుల కోసం హెల్ప్ డెస్క్!
Tirupati: అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపల్ అభ్యర్థుల కోసం తహశీల్దార్ ఆఫీస్లో ప్రత్యేక హెల్ప్ డెస్క్, కుల ధ్రువీకరణ పత్రాల కోసం నియోజకవర్గ హెల్ప్ డెస్క్.
Tirupati: నర్సీపట్నం మున్సిపల్ అభ్యర్థుల కోసం హెల్ప్ డెస్క్!
Tirupati: తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ చైర్పర్సన్ కూటమి అభ్యర్థిగా "నెలవల షాలిని" అకస్మాత్తుగా వెలుగులోకి వచ్చింది, నాయుడుపేట మున్సిపాలిటీ కూటమి చైర్ పర్సన్ అభ్యర్థులుగా ఆశావాహులు ఎక్కువవుతున్న సమయంలో మరియు ఈరోజు నాయుడుపేట మున్సిపాలిటీ లోనే కేకే కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ నాయకుల సమన్వయ సమావేశం జరుగుతున్న వేళ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పనబాక లక్ష్మి ఎన్నికల అబ్జర్వర్ బాలాజీ లు విచ్చేయుచున్నారు, ఈ సమయంలో నెలవల షాలిని పేరు వినిపించడం చర్చనీయాంశంగా మారింది,
నెలవల షాలిని సులూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ కుటుంబ సభ్యులు కావడం, నెలవల షాలిని పేరు ను కూడా నాయుడుపేట మున్సిపాలిటీలోని తెలుగుదేశం పార్టీ నాయకులు సమ్మతించారు అంటూ తెలుస్తోంది. నాయుడుపేట మున్సిపాలిటీ రిజర్వేషన్ జనరల్ మహిళ కావడంతో నెలవల షాలిని గత కొద్ది రోజులుగా అంతర్గతంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానంతో చర్చించినట్లు తెలుస్తుంది, అయితే తెలుగుదేశం పార్టీ నాయుడుపేట మున్సిపాలిటీ నాయకుల సమన్వయ కార్యక్రమంలో నాయుడుపేట మున్సిపాలిటీ కూటమి చైర్ పర్సన్ అభ్యర్థిగా నెలవల షాలిని పేరు ను నాయకులు అధినాయకులకు తెలియపరుస్తారు అన్నది గట్టిగా వినిపిస్తున్న విషయం నాయుడుపేట మున్సిపాలిటీలో చర్చనీయాంశమయ్యింది.




