Naidupeta: నాయుడుపేటలో నారీ నినాదం.. మిన్నంటిన గణేష్ సంబరాలు
Naidupeta: నాయుడుపేట రాజగోపాలపురంలో వినాయక చవితి పూజల నుంచి నిమజ్జన శోభాయాత్ర వరకు మహిళలే అన్నీ తామై నడిపించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Naidupeta: నాయుడుపేటలో నారీ నినాదం.. మిన్నంటిన గణేష్ సంబరాలు
నాయుడుపేట: ఏ రంగంలోనైనా, ఏ వేడుకలోనైనా మేం ఎవరికీ తక్కువ కాం...అని నిరూపిస్తూ నాయుడుపేట రాజగోపాలపురం నారీమణులు గణేష్ ఉత్సవాల్లో ఊరేగింపు అంటే పురుషుల హడావుడే ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఈసారి
ఆ రొటీన్‌కు భిన్నంగా.. రాజగోపాల్‌పురంలో మహిళలు, యువతులే ఉత్సవాలకు ప్రధాన ఆకర్షణగా నిలిచారు.
అన్నింట్లోనూ ముందే..:
గణనాథుని ప్రతిష్ఠా, నిత్య పూజల నిర్వహణ నుంచి మొదలుకొని, ప్రసాదాల తయారీ, మండప ప్రాంగణ అలంకరణ వరకు ప్రతీ పనిలోనూ మహిళలు క్రియాశీలక పాత్ర పోషించారు. మంత్రోచ్చారణల మధ్య భక్తిశ్రద్ధలతో పూజలు జరిపిస్తూనే, ఉత్సవ నిర్వహణ బాధ్యతలను భుజాన వేసుకుని 'అన్నీ తామై' వ్యవహరించారు.
తప్పెట్ల మోతకు అదిరిపోయే డాన్సులు:
ఇక నిమజ్జన ఊరేగింపులో మహిళల జోష్ తమకు ఏది సాటి కాదు అనేలా సాగింది. శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన శోభాయాత్రలో తప్పెట్ల శబ్దాలు, మంగళ వాయిద్యాల హోరుకు అనుగుణంగా యువతులు, మహిళలు పోటీపడి చిందులు చేశారు. సాంప్రదాయ కట్టుబొట్టుతో, ఉత్సాహంగా అడుగులు వేస్తూ ఊరేగింపును మరింత కళకళలాడేలా చేశారు.
పట్టణ వీధుల గుండా సాగిన ఈ శోభాయాత్రను ప్రజలు పెద్ద సంఖ్యలో వీక్షించారు ..ఈసారి గణనాథుని ఊరేగింపులో మహిళల అవ్వ మామూలుగా లేదు ..అని స్థానికులు కొనియాడేలా ఉత్సవాలు అంబరాన్నంటాయి. భక్తి, ఆనందం, నారీశక్తి కలగలిసిన ఈ వేడుక నాయుడుపేటలో ఒక ప్రత్యేకమైన జ్ఞాపకంగా నిలిచిపోయేలా జరిగింది.




