Renigunta: గాజులమండ్యం పరిధిలో టపాసుల కంటైనర్ పట్టివేత!
Renigunta: రేణిగుంట మండలం గాజులమండ్యంలో టపాసుల కంటైనర్ పట్టివేతపై వీడని సస్పెన్స్. మూడు రోజులు గడుస్తున్నా వివరాలు వెల్లడించని అధికారులు. స్థానికంగా చర్చనీయాంశం.
Renigunta: గాజులమండ్యం పరిధిలో టపాసుల కంటైనర్ పట్టివేత!
Renigunta: రేణిగుంట మండలంలోని గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో టపాసులతో కూడిన కంటైనర్ను పట్టుకుని మూడు రోజులు గడుస్తున్నప్పటికీ,ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికాకపోవడంతో స్థానికంగా చర్చకు దారితీస్తోంది.
కంటైనర్ను ఎక్కడ పట్టుకున్నారు? అందులో ఎంతమేర టపాసులు ఉన్నాయి? వాటికి సంబంధించిన అనుమతులు, రవాణా పత్రాలు సక్రమంగా ఉన్నాయా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
ఈ ఘటనకు సంబంధించి సంబంధిత అధికారులు వివరాలు వెల్లడిస్తే వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయని మీడియా వర్గాలు భావిస్తున్నాయి.




