Renigunta: రేణిగుంటలో యార్డు ఆధునీకరణ పనులు నవంబర్ 10 నుంచి పలు రైళ్లు రద్దు!

Renigunta: రేణిగుంట రైల్వే స్టేషన్ యార్డు ఆధునీకరణ పనుల కారణంగా నవంబర్ 10 నుంచి డిసెంబర్ 27 వరకు పలు ఎక్స్‌ప్రెస్ మరియు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసి దారి మళ్లించారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 1 Oct 2026 9:56 AM IST
Renigunta
X

Renigunta: రేణిగుంటలో యార్డు ఆధునీకరణ పనులు నవంబర్ 10 నుంచి పలు రైళ్లు రద్దు!

Renigunta: రేణిగుంట రైల్వే స్టేషన్‌ యార్డు ఆధునీకరణ పనుల్లో భాగంగా రైలు మార్గాల అనుసంధాన పనులు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 10 నుంచి డిసెంబర్ 27 వరకు పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్ని రైళ్లను దారి మళ్లించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

కడప–అరక్కోణం, తిరుచానూరు–అరక్కోణం, చెన్నై–తిరుచానూరు, గూడూరు–రేణిగుంట, నెల్లూరు–రేణిగుంట మధ్య నడిచే పలు ప్యాసింజర్ రైళ్లు రద్దు కానున్నాయి. చెన్నై–తిరుపతి సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌తో పాటు తిరుపతి, తిరుచానూరు, రేణిగుంట నుంచి నడిచే మరికొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా నిర్ణీత తేదీల్లో రద్దు చేశారు.

అదేవిధంగా తిరుపతి–విశాఖపట్నం డబుల్ డెక్కర్, రేణిగుంట–మైసూరు, తిరుపతి–భువనేశ్వర్ తదితర ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా కొన్ని తేదీల్లో రద్దు చేయనున్నారు.

73 ఎక్స్‌ప్రెస్ రైళ్లు దారి మళ్లింపు

రేణిగుంట మీదుగా ముంబై, హౌరా, ఢిల్లీ, కన్యాకుమారి, చెన్నై, త్రివేండ్రం, బెంగళూరు, మైసూరు తదితర ప్రాంతాలకు వెళ్లే 73 ఎక్స్‌ప్రెస్ రైళ్లను దారి మళ్లించనున్నారు. కొన్ని రైళ్లు గుత్తి–ధర్మవరం మీదుగా, మరికొన్ని గూడూరు–పెరంబూరు మీదుగా నడవనున్నాయి. దీంతో ప్రయాణికులు సంబంధిత రైళ్ల తాజా రూట్, రద్దు వివరాలను ముందుగా పరిశీలించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA