Renigunta: రేణిగుంటలో ప్రారంభమైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ!
Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట ఎంపీడీవో కార్యాలయంలో ప్రారంభమైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ. 100 మీటర్ల పరిధిలో ఆంక్షలు, భారీ భద్రత ఏర్పాటు.
Renigunta: రేణిగుంటలో ప్రారంభమైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ!
Renigunta: స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. రేణిగుంట ఎంపీడీవో కార్యాలయం వద్ద పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. నామినేషన్ కేంద్రం చుట్టూ 100 మీటర్ల పరిధిలో నిబంధనలు అమలు చేస్తూ, అభ్యర్థులు, వారి అనుచరుల రాకపోకలపై పర్యవేక్షణ చేపట్టారు.
నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ క్రమంలో జిల్లాస్థాయి అధికారులు నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.
మధ్యాహ్నం ఒంటి గంట సమయం దాటుతున్నప్పటికీ ఇప్పటివరకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. పలువురు ఎంపీటీసీ అభ్యర్థులు శుభ ముహూర్తం కోసం ఎదురుచూస్తుండటంతో నామినేషన్ల దాఖలుకు మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.




